దసరా వేళ ప్రజలకు తీపి కబురు చెప్పిన ఏపీఎస్ఆర్టీసీ
- దసరాకు 1,081 ప్రత్యేక బస్సులను ప్రకటించిన ఏపీఎస్ఆర్టీసీ
- ఈ నెల 29 నుంచి వచ్చే నెల 10 వరకు సర్వీసులు
- ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలకు స్వస్తి
- సోమవారం నుంచి ప్రత్యేక బస్సుల్లో రిజర్వేషన్ ప్రారంభం
ఈ తరహా సంస్కృతికి ఏపీఎస్ఆర్టీసీ స్వస్తి చెప్పేసింది. ఈ ఏడాది దసరా సందర్భంగా ప్రజల రవాణా నిమిత్తం 1,081 అదనపు సర్వీసులను నడపనున్నట్లు ఆ సంస్థ సోమవారం రాత్రి ప్రకటించింది. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 10 దాకా కొనసాగనున్న ఈ స్పెషల్ సర్వీసుల్లో సాధారణ చార్జీలే వసూలు చేయాలని ఆ సంస్థ నిర్ణయించింది. అంతేకాకుండా సోమవారం రాత్రి నుంచే దసరా వేళ నడపనున్న ప్రత్యేక బస్సుల జాబితాను తన అధికారిక వెబ్సైట్లో విడుదల చేయడంతో పాటుగా వాటిలోనూ రిజర్వేషన్లకు అనుమతి మంజూరు చేసింది.
దసరా నేపథ్యంలో ప్రత్యేక బస్సులుగా నడవనున్న ఆర్టీసీ సర్వీసులు... విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై.. విజయవాడ నుంచి విశాఖ, రాజమహేంద్రవరం, కాకినాడ... విజయవాడ నుంచి తిరుపతి, రాయలసీమ జిల్లాలు... విజయవాడ నుంచి అమలాపురం, భద్రాచలంల మధ్య నడవనున్నాయి.