చరిత్ర సృష్టించిన భారత రెజ్లర్ బజ్ రంగ్ పునియా
- ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో నాలుగు పతకాలతో రికార్డు
- తాజా ఎడిషన్ లో కాంస్య పతకం గెలిచిన పూనియా
- కాంస్య పతక పోరులో 11-9తో గెలుపు
దీన్ని బజ్ రంగ్ రెండు చేతులా సద్వినియోగం చేసుకున్నాడు. రెజిచేజ్ తొలి బౌట్లో 7-6తో వాజ్ బెజ్ తెవాన్యన్ (అర్మేనియా)పై నెగ్గి కాంస్య పతక పోరుకు అర్హత సాధించాడు. అనంతరం జరిగిన కాంస్య పతక బౌట్ లో పూనియా 11-9తో సెబాస్టియన్ రివెరా (ప్యూర్టోరికో)పై విజయం సాధించి పతకం గెలుచుకున్నాడు. 2013లో 60 కేజీల విభాగంలో కాంస్యం, 2018లో 65 కేజీల విభాగంలో రజతం గెలిచిన బజ్ రంగ్ 2019లో కాంస్యం గెలిచాడు. మొత్తం ఏడు సార్లు పోటీపడ్డ అతను నాలుగు పతకాలతో ప్రపంచ చాంపియన్ షిప్ లో అత్యంత విజయవంతమైన భారత రెజ్లర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.