Linga Reddy: ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ నాకే వస్తుంది: లింగారెడ్డి

I will get Proddatur TDP ticket says Linga Reddy
  • టీడీపీ అభ్యర్థిగా తనకు అన్ని అర్హతలు ఉన్నాయన్న లింగారెడ్డి
  • అభ్యర్థిని కేవలం పార్టీ అధిష్ఠానం మాత్రమే ప్రకటిస్తుందని వ్యాఖ్య
  • ఇతరులు అభ్యర్థిని ప్రకటిస్తే క్రమశిక్షణారాహిత్యం అవుతుందన్న లింగారెడ్డి
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ... వివిధ పార్టీల్లోని ఆశావహులు టికెట్ల విషయంపై అప్పుడే తమ ప్రయత్నాలను ప్రారంభిస్తున్నారు. ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ తనకే వస్తుందని కడప పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు లింగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈ విషయం గురించి తాను ఎప్పుడూ మాట్లాడలేదని చెప్పారు. ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థిగా తనకు అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. 

పార్టీపై విధేయత, రాజకీయ అనుభవం, గత చరిత్ర తదితర అంశాల ఆధారంగా అభ్యర్థిని పార్టీ అధిష్ఠానం ప్రకటిస్తుందని చెప్పారు. పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడినైన తనకు గానీ, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డికి గానీ అభ్యర్థిని ప్రకటించే అర్హత లేదని అన్నారు. అలా ఎవరైనా అభ్యర్థిని ప్రకటిస్తే... క్రమశిక్షణారాహిత్యం అవుతుందని చెప్పారు.
Linga Reddy
TDP
Proddatur

More Telugu News