నార్త్ ఇండియా మెంటాల్టీ: శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు
- చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
- మహిళా నాయకత్వాన్ని దేశం అంగీకరించేందుకు సిద్ధంగా లేదన్న పవార్
- కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పటి నుంచి తాను ఈ అంశంపై మాట్లాడుతున్నానని వ్యాఖ్య
మహిళల రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నప్పటి నుంచి తాను పార్లమెంటులో మాట్లాడుతూనే ఉన్నానని... కానీ, ఇప్పటి వరకు ఆ బిల్లుకు ఆమోదం లభించలేదని చెప్పారు. మహిళా రిజర్వేషన్లపై పార్లమెంటులో మాట్లాడిన తర్వాత... తమ పార్టీ ఎంపీలు కూడా లేచి వెళ్లిపోతుండటాన్ని తాను చూశానని... అంటే, తమ పార్టీ నేతలకు కూడా మహిళా రిజర్వేషన్లు ఇష్టం లేదనే విషయం అర్థమవుతోందని అన్నారు.