Usian Bolt: క్రికెట్ లో సత్తా చాటేందుకు ఉరకలు వేస్తున్న పరుగుల చిరుత

  • త్వరలో గ్లోబల్ టీ20 పవర్ క్రికెట్ లీగ్
  • లీగ్ లో ఆడాలంటూ ఉసేన్ బోల్ట్ కు ఆహ్వానం
  • క్రికెట్ ఎంట్రీ ఇవ్వనున్న బోల్ట్
  • అక్టోబరు 2 నుంచి జీపీసీఎల్ టోర్నీ
Usain Bolt set make cricket debut by GPCL

స్ప్రింట్ వీరుడు ఉసేన్ బోల్ట్ వెస్టిండీస్ దీవుల్లోని జమైకాకు చెందినవాడు. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో బోల్ట్ చిరుతను తలపించేలా పరుగెత్తి వరల్డ్ రికార్డులను స్థాపించాడు. స్ప్రింట్ రారాజుగా ప్రపంచ అథ్లెటిక్స్ రంగాన్ని శాసించాడు. 

ఒలింపిక్స్ లో 8 స్వర్ణాలు, వరల్డ్ చాంపియన్ షిప్స్ లో 11 స్వర్ణాలు సాధించిన బోల్ట్ కొంతకాలం కిందట పరుగుకు వీడ్కోలు పలికాడు. ఇక తనకెంతో ఇష్టమైన క్రికెట్ లో తన సత్తా చాటాలని బోల్ట్ భావిస్తున్నాడు. త్వరలో జరిగే గ్లోబల్ టీ20 పవర్ క్రికెట్ లీగ్ (జీపీసీఎల్) ద్వారా బోల్ట్ క్రికెట్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే లీగ్ లో ఆడాల్సిందిగా టోర్నీ నిర్వాహకులు బోల్ట్ ను ఆహ్వానించారు. 

ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. భారత్ కు చెందిన పవర్ స్పోర్ట్స్ అనే లైవ్ డిజిటల్ స్పోర్ట్స్ చానల్ బోల్ట్ కు ఇన్విటేషన్ పంపింది. త్వరలోనే ఈ టోర్నీ జరగనుంది. ట్రాక్ పై చిరుతలా దూసుకెళ్లే బోల్డ్, పిచ్ పై ఎలా పరుగులు సాధిస్తాడన్నది ఆసక్తి కలిగిస్తోంది. 

బోల్ట్ క్రికెటర్ అవ్వాలన్న కల ఇప్పటిది కాదు. క్రికెటర్ అవ్వాలని బోల్ట్ చిన్నప్పటి నుంచి అనుకునేవాడు. కానీ కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో, అథ్లెటిక్స్ వైపు అడుగులేశాడు. ఇన్నాళ్లకు తన చిన్ననాటి కలను నెరవేర్చుకోబోతున్నాడు. ఈ జీపీసీఎల్ టోర్నీ ఢిల్లీలో అక్టోబరు 2 నుంచి 9వ తేదీ వరకు జరగనుంది.

More Telugu News