1,213 మట్టి టీ కప్పులతో మోదీ సైకత శిల్పం... సుదర్శన్ పట్నాయక్ వీడియో ఇదిగో
- నేడు ప్రధాని నరేంద్ర మోదీ బర్త్ డే
- సైకత శిల్పంతో మోదీకి విషెస్ చెప్పిన సుదర్శన్ పట్నాయక్
- పూరీ తీరంలో భారీ సైకత శిల్పాన్ని ఆవిష్కరించిన సైకత శిల్పి
పూరీ నగరం సమీపాన సాగర తీరంలో ఇసుకతో మోదీ ముఖాన్ని తీర్చిదిద్దిన సుదర్శన్... ఆ ముఖం చుట్టూ... ఏకంగా 1,213 మట్టితో తయారు చేసిన టీ కప్పులను ఏర్పాటు చేసి ఓ ఫ్రేమ్ లాంటి నిర్మాణాన్ని కట్టేశారు. మోదీ ముఖానికి ముందు హ్యాపీ బర్త్‌డే మోదీజీ అని కూడా ఆయన రాశారు. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.