Aadhar: వయోజనులు పదేళ్లకోసారి తమ ఆధార్ కార్డులు అప్ డేట్ చేసుకోవాలి: యూఐడీఏఐ

  • 5-15 ఏళ్ల వారు అప్ డేట్ చేయించుకోవడం తప్పనిసరి
  • పెద్దవాళ్లు కూడా అప్ డేట్ చేయించుకోవాలన్న యూఐడీఏఐ
  • 70 ఏళ్లు దాటిన వారికి అప్ డేట్ అవసరంలేదని వెల్లడి
UIDAI says adults should update their Aadhar cards

ఏ వయసుల వారు ఆధార్ కార్డులు అప్ డేట్ చేసుకోవాలన్న అంశంపై యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) వివరణ ఇచ్చింది. వయోజనులు పదేళ్ల కోసారి తమ ఆధార్ కార్డులను అప్ డేట్ చేసుకోవాలని వెల్లడించింది.

ప్రస్తుతం 5 నుంచి 15 ఏళ్ల వయసున్నవారి ఆధార్ కార్డులు అప్ డేట్ చేసుకోవడం తప్పనిసరి అనే నిబంధన ఉందని, అయితే, వయోజనులు కూడా తమ బయోమెట్రిక్ వివరాలతో తప్పనిసరిగా అప్ డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ స్పష్టం చేసింది. 

70 ఏళ్లు దాటిన వృద్ధులు ఆధార్ అప్ డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. కాగా, దేశంలో ఆధార్ కలిగివున్న వారి శాతం 93.5కి చేరిందని వెల్లడించింది.

దేశవ్యాప్తంగా 50 వేల ఆధార్ అప్ డేట్ కేంద్రాలు ఉన్నాయని యూఐడీఏఐ తెలిపింది. ఫోన్ నెంబర్లు, చిరునామాల వరకు అప్ డేట్ చేసేందుకు 1.50 లక్షల మంది పోస్టుమేన్లను వినియోగిస్తున్నట్టు వివరించింది.  ఒక్క ఆగస్టు మాసంలోనే 24.2 లక్షల మంది కొత్తగా ఆధార్ ఎన్ రోల్ మెంట్ చేయించుకున్నారని తెలిపింది.

More Telugu News