చీతాలు వచ్చేశాయ్!. గ్వాలియర్‌లో ల్యాండైన ‘చీతా’ విమానం
- నమీబియా నుంచి 8 చీతాలను తీసుకొచ్చిన విమానం
- గ్వాలియర్ విమానాశ్రయంలో స్వాగతం పలికిన అధికారులు
- మధ్యప్రదేశ్‌కు ఇంతకు మించిన గొప్ప బహుమతి మరోటి లేదన్న సీఎం చౌహాన్
- చీతాలను కునో నేషనల్ పార్క్‌లో విడిచిపెట్టనున్న ప్రధాని
చీతాలను ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘ప్రాజెక్టు చీతా’ ప్రపంచంలోనే తొలి అతిపెద్ద ఖండాంతర ట్రాన్స్‌లొకేషన్ ప్రాజెక్టు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ.. నమీబియా నుంచి కునో నేషనల్ పార్క్‌కు చీతాలు రావడానికి మించిన గొప్ప బహుమతి మధ్యప్రదేశ్‌కు మరోటి లేదని అన్నారు. ఇది చారిత్రాత్మకమని, ఈ శతాబ్దంలోనే ఇది అతిపెద్ద వన్యప్రాణుల ఘటన అని పేర్కొన్నారు. చీతాల రాకతో మధ్యప్రదేశ్ పర్యాటకానికి ఊపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఎనిమిది చీతాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కునో నేషనల్ పార్క్‌లో ప్రవేశపెడతారు.