పాదయాత్రలో రాహుల్ గాంధీని ముద్దు పెట్టుకున్న మహిళ.. ఫొటో ఇదిగో
- కన్యాకుమారి నుంచి ప్రారంభమైన యాత్ర
- శుక్రవారం నాటికి 9వ రోజుకు చేరుకున్న భారత్ జోడో యాత్ర
- కేరళలో రాహుల్‌ను ముద్దు పెట్టుకున్న నడి వయసు మహిళ
9వ రోజు పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ మరింత ఉత్సాహంగా కనిపించారు. యాత్రలో బాగంగా వడివడిగా నడుస్తున్న రాహుల్ గాంధీ వద్దకు వచ్చిన ఓ నడి వయసు మహిళ ఆయనకు ఆప్యాయంగా ముద్దు పెట్టింది. ఈ సందర్భంగా రాహుల్ కూడా ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని, పలకరించారు. తన యాత్రకు భద్రత కల్పిస్తున్న పోలీసుల్లో ఇద్దరు మహిళా పోలీసు అధికారులతో కలిసి నడుస్తూ రాహుల్ ఫొటోలకు పోజిచ్చారు.