Telangana: జాతీయ స‌మైక్య‌తా దినోత్స‌వం నేపథ్యంలో.. భారీ ర్యాలీలో పాల్గొన్న అస‌దుద్దీన్ ఒవైసీ... ఇవిగో ఫొటోలు, వీడియోలు

mjlis chief asaduddin owaisi participated in rally with out security
  • తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా దినోత్స‌వాల్లో భాగంగా మ‌జ్లిస్ ర్యాలీ
  • న‌మాజ్ ముగిసిన త‌ర్వాత బైక్ ర్యాలీ, ఆ త‌ర్వాత ర్యాలీ నిర్వ‌హించిన వైనం
  • ప్ర‌జ‌లకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన ఒవైసీ
మ‌జ్లిస్ అధినేత‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ... తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని శుక్ర‌వారం పాత‌బ‌స్తీలో భారీ ర్యాలీ నిర్వ‌హించారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం న‌మాజ్ ముగిసిన వెంట‌నే తొలుత బైక్ ర్యాలీలో పాల్గొన్న ఆయ‌న... ఆ త‌ర్వాత భారీ జ‌న‌సందోహంతో ర్యాలీ చేప‌ట్టారు. 

ఈ సంద‌ర్భంగా ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే ఆయ‌న జ‌నంతో క‌లిసి ర్యాలీలో ముందుకు సాగారు. భారీ జ‌న సందోహం నేప‌థ్యంలో కొన్ని చోట్ల తొక్కిసలాట జ‌రిగేలా క‌నిపించినా ఏమాత్రం వెన‌క్కు త‌గ్గ‌ని ఒవైసీ న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు అభివాదం చేస్తూ త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చిన చిన్నారుల‌తో చేతులు క‌లుపుతూ ఉత్సాహంగా ముందుకు సాగారు.
Telangana
Hyderabad
AIMIM
Asaduddin Owaisi
Old City
Rally

More Telugu News