Andhra Pradesh: వాలంటీర్ల‌ను ఎన్నిక‌ల విధుల్లో వినియోగించ‌రాదు: ఏపీ ఎస్ఈసీ మీనా ఆదేశాలు

  • జిల్లా క‌లెక్ట‌ర్లు, రిట‌ర్నింగ్ అధికారుల‌తో ఎస్ఈసీ స‌మావేశం
  • వాలంటీర్ల‌కు ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఏ ప‌నులూ అప్ప‌గించొద్ద‌ని సూచ‌న‌
  • ప్రభుత్వ వేత‌నం తీసుకుంటున్నా వారి సేవ‌ల వినియోగం వ‌ద్ద‌ని వివ‌ర‌ణ‌
ap sec orders to not to utilise valanteers in election duties

ఏపీలో కొత్త‌గా అందుబాటులోకి వ‌చ్చిన గ్రామ‌, వార్డు వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌కు సంబంధించి ఆ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ముఖేశ్ కుమార్ మీనా శుక్ర‌వారం కీల‌క ఆదేశాలు జారీ చేశారు. వాలంటీర్ల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఎన్నిక‌ల విధుల్లో వినియోగించ‌రాదంటూ ఆయన జిల్లా క‌లెక్ట‌ర్లు, రిటర్నింగ్ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేర‌కు శుక్ర‌వారం ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారుల‌తో స‌మావేశం సంద‌ర్భంగా మీనా ఈ ఆదేశాలు జారీ చేశారు.

గ్రామ‌, వార్డు వాలంటీర్లు ఎన్నిక‌ల విధుల్లో పాల్గొన‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాలని ఈ సంద‌ర్భంగా మీనా అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఓట‌ర్ కార్డుతో ఆధార్ అనుసంధాన ప్రక్రియ‌లో వారిని భాగ‌స్వాముల‌ను చేయొద్దని ఆయ‌న సూచించారు. వాలంటీర్ల‌కు ఎన్నిక‌లకు సంబంధించిన ఏ ప‌నుల‌ను అప్ప‌గించ‌వ‌ద్దని ఆదేశించారు. ప్ర‌భుత్వ వేత‌నం తీసుకుంటున్నందున వారిని భాగ‌స్వాముల‌ను చేయొద్దని కూడా మీనా ఆదేశాలు జారీ చేశారు.

More Telugu News