కోలీవుడ్ లో శింబు సినిమాకి హిట్ టాక్!
- తమిళనాట విడుదలైన శింబు సినిమా
- తొలి ఆటతోనే వచ్చిన హిట్ టాక్
- ఆయన నటనకి దక్కుతున్న ప్రశంసలు
- తెలుగులో ఈ నెల 17వ తేదీన విడుదల
గౌతమ్ మీనన్ కథాకథనాలు .. టేకింగ్ అద్భుతంగా ఉన్నాయనీ, చాలా కాలం తరువాత ఆయన మార్క్ కనిపించిందని చెబుతున్నారు. శింబు చాలా గొప్పగా చేశాడనీ .. ఆయన యాక్టింగ్ ఈ సినిమాకి హైలైట్ అయిందని అంటున్నారు. శింబు కెరియర్లో ఈ సినిమా ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెబుతున్నారు.
చూస్తుంటే శింబు మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడనే విషయం స్పష్టమైపోతూనే ఉంది. గ్రామీణ ప్రాంతంలో కాటి కాపరిగా చేసిన ఒక యువకుడు, మాఫియా లీడర్ గా ఎలా ఎదిగాడనేది కథ. ఇక ఈ సినిమా తెలుగులో 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' అనే టైటిల్ తో ఈ నెల 17వ తేదీన విడుదల కానుంది. ఇక్కడ ఈ సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.