ఎయిరిండియా విమానంలో దట్టమైన పొగలు... 14 మందికి అస్వస్థత
- మస్కట్ ఎయిర్ పోర్టులో ఘటన
- విమానం ఇంజిన్ లో మంటలు
- విమానం అంతటా వ్యాపించిన పొగలు
- ప్రయాణికులను దించి వేసిన అధికారులు
తోక భాగం వద్ద స్లైడ్ డోర్ (జారుడు బల్ల తరహా ద్వారం) తెరిచి వారిని సురక్షితంగా దించేశారు. వారిని టెర్మినల్ బిల్డింగ్ లోకి తరలించారు. కాగా, ఈ ఘటనలో 14 మంది అస్వస్థతకు గురైనట్టు తెలిసింది.
ఈ విమానం బుధవారం ఉదయం మస్కట్ నుంచి కేరళలోని కొచ్చి రావాల్సి ఉంది. విమానంలో పొగలు రావడంతో, ప్రయాణికులను మరో విమానంలో తరలించే అవకాశాలున్నాయి.