సీపీఎస్ రద్దుపై ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన... వివరాలు ఇవిగో
- సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్
- ఇప్పటిదాకా అమలు కాని హామీ
- ఆందోళన బాట పడుతున్న ఉద్యోగులు
- 2004 సెప్టెంబర్ 1 నాటికి సర్వీసులో చేరిన వారికే పాత పెన్షన్ అంటూ కొత్త ప్రతిపాదన
- రేపు ఆయా శాఖల అధికారులతో కీలక భేటీ కానున్న ప్రభుత్వం
2004 సెప్టెంబర్ 1 నాటికి ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి మాత్రమే సీపీఎస్‌ను రద్దు చేస్తూ వారికి పాత పెన్షన్ స్కీంను అమలు చేసే దిశగా వైసీపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగుల వివరాలు, వారు సర్వీసుల్లో చేరిన తేదీలతో పంపాలని ఆయా శాఖలకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ వివరాలతో బుధవారం జరగనున్న సమావేశానికి హాజరు కావాలని ఆయా శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రేపటి భేటీలో సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ స్కీం అమలు తదితరాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.