3 రాజధానులే రెఫరెండంగా 2024 ఎన్నికలకు వెళతాం: ఏపీ మంత్రి అమర్నాథ్
- అమరావతి రైతుల మహాపాదయాత్రపై మంత్రి అమర్నాథ్ విమర్శలు
- ఐదేళ్లలో చేసిన అభివృద్ధి నినాదంతోనే ఎన్నికలకు వెళతామన్న మంత్రి
- విశాఖ అభివృద్ధి వద్దని పాదయాత్ర పేరుతో ఉత్తరాంధ్ర వస్తున్నారని విమర్శ
అంతేకాకుండా మూడు రాజధానులే రెఫరెండంగా 2024 ఎన్నికలకు వస్తామని కూడా ఆయన ప్రకటించారు. ఈ ఐదేళ్లలో చేసిన సంక్షేమం నినాదంతో ఎన్నికలకు వెళతామని తెలిపారు. విశాఖ అభివృద్ధి వద్దని పాదయాత్ర పేరుతో ఉత్తరాంధ్ర వస్తున్నారంటూ ఆయన అమరావతి రైతుల మహాపాదయాత్రపై విమర్శలు గుప్పించారు.