AP: పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే అగ్రగామిగా ఏపీ

  • జులై మాసం నివేదిక విడుదల చేసిన డీపీఐఐటీ
  • ఏడు నెలల వ్యవధిలో రూ.40 వేల కోట్లు రాబట్టిన ఏపీ
  • రెండో స్థానంలో ఒడిశా
  • దేశంలో ఈ రెండు రాష్ట్రాల వాటా 45 శాతం
AP topped the chart in attracts investments

ఏపీ ప్రభుత్వం మరో ఘనత సాధించింది. పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే అగ్రగామిగా అవతరించింది. డీపీఐఐటీ (డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) జులై నెల నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఏడు నెలల వ్యవధిలో ఏపీ రూ.40,361 కోట్లు రాబట్టినట్టు ఆ నివేదిక పేర్కొంది. ఏపీ తర్వాత రెండో స్థానంలో ఒడిశా నిలిచింది. ఒడిశా ఏడు నెలల కాలంలో రూ.36,828 కోట్ల పెట్టుబడులు ఆకర్షించింది. దేశంలో పెట్టుబడుల విషయంలో ఈ రెండు రాష్ట్రాలది 45 శాతం అని డీపీఐఐటీ తెలిపింది. ఈ ఏడు నెలల వ్యవధిలో దేశం మొత్తం మీద 1.71 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు వెల్లడించింది.

More Telugu News