కలెక్షన్లలో దూసుకెళ్తున్న 'బ్రహ్మాస్త్ర'
- సోమవారం రూ. 19 కోట్ల వసూళ్లు
- తొలి నాలుగు రోజుల్లో కలిపి రూ. 137-139 వచ్చినట్టు అంచనా
- గాడిలో పడిన బాలీవుడ్ పరిశ్రమ
వారాంతం వసూళ్లను కొనసాగిస్తూ సోమవారం కూడా బ్రహ్మాస్త్రకు మంచి వసూళ్లు రావడం విశేషం. సోమవారం నాడు హిందీలో రూ. 14.25 కోట్లు రాబట్టింది. అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.17-19 కోట్లు వచ్చినట్టు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన తొలి నాలుగు రోజుల్లోనే బ్రహ్మాస్త్ర రూ. 137-139 కోట్లు వసూళ్లు చేసి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
ఇదే జోరు కొనసాగితే మరికొన్ని రోజుల్లోనే రూ. 250 కోట్ల మార్కు అందుకునే అవకాశం కనిపిస్తోంది. రెండు పార్టుల్లో వస్తున్న ఈ చిత్రాన్ని కరణ్ జొహార్ రూ. 400 కోట్ల పైచిలుకు బడ్జెట్‌తో నిర్మించాడు. ఇందులో నాగార్జున, మౌని రాయ్, అమితాబ్ బచ్చన్ కూడా నటించారు. షారూక్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించారు.