Sake Sailajanath: చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు జై కొట్టిన జగన్ ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారు?: శైలజానాథ్

Sailaja Nath slams CM Jagan over Amaravati capital
  • ఏపీ రాజధాని అంశంపై శైలజానాథ్ స్పందన
  • ఈ భూమిపై రాజధాని లేని రాష్ట్రం ఏపీ ఒక్కటేనని వెల్లడి
  • జగన్ డ్రామాలు ఆపాలని హితవు
ఏపీ రాజధాని అంశంపై ఏపీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ స్పందించారు. రాష్ట్ర రాజధాని అందరికీ అందుబాటులో ఉండాలనేది కాంగ్రెస్ విధానం అని వెల్లడించారు. ఈ భూమిపై రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమేనని వ్యాఖ్యానించారు. 

చంద్రబాబు హయాంలో ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పుడు జై కొట్టిన జగన్, ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధానిపై ఏపీ మంత్రులు తగ్గేదేలే అంటూ బీరాలు పోతున్నారని, ఇదంతా ఎవరి కోసం, ఎందుకోసం చేస్తున్నారో చెప్పాలని శైలజానాథ్ నిలదీశారు. 

అమరావతి రాజధానిని చంపేపి, మూడు రాజధానులు అనడం సరైన నిర్ణయం అవుతుందా? తలతిక్క వ్యవహారాలు, చేతకాని నిర్ణయాలను పక్కనబెట్టి... రాజధాని విషయంలో సరిగ్గా వ్యవహరించాలి అని హితవు పలికారు. రాజకీయ డ్రామాలు ఆపి సీఎం జగన్ రోడ్లపై తిరిగితే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. శాసన రాజధాని, న్యాయ రాజధాని, పరిపాలనా రాజధాని ప్రజల మధ్య విద్వేషాలు రగల్చడానికేనని శైలజానాథ్ విమర్శించారు.
Sake Sailajanath
Amaravati
AP Capital
Jagan
Andhra Pradesh

More Telugu News