23 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్.. కళ్లు చెదిరే ఆఫర్లు

Amazon Great Indian Festival sale date announced
  • పండుగల ముందు భారీ తగ్గింపు విక్రయాలు
  • ఐఫోన్ 13, ఐక్యూ 9టీపై ఆకర్షణీయమైన ఆఫర్లు
  • ఎస్ బీఐ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్
ఏటా దసరా, దీపావళి ముందు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ భారీ తగ్గింపు విక్రయాలను నిర్వహిస్తుంటాయి. అదే క్రమంలో ఈ ఏడాది అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ ఈ నెల 23న ప్రారంభం కానుంది. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఇతర కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ పరికరాలు (టీవీలు, ఫ్రిజ్డ్ లు, ఓవెన్లు తదితర), వస్త్రాలు, గృహోపకరణాలు, ఫర్నిచర్ ఇలా అన్ని రకాల ఉత్పత్తులపైనా మంచి తగ్గింపులు లభించనున్నాయి. 

సాధారణ రోజులతో పోలిస్తే గ్రేట్ ఇండియా ఫెస్టివల్ లో ధరలు కొంత తక్కువగా, డిస్కౌంట్ తో లభిస్తుంటాయి. దీనికితోడు ఎస్ బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం తగ్గింపును అమెజాన్ ఇండియా ఆఫర్ చేయనుంది. క్రెడిట్ కార్డు ఈఎంఐలపైనా ఇంతే తగ్గింపు లభిస్తుంది. 

ఐఫోన్ 13, ఐక్యూ 9టీపై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేయనుంది. అన్ని రకాల తగ్గింపుల తర్వాత ఐఫోన్ 13 రూ.53,000-54,000 వరకు రావచ్చని అంచనా. శామ్ సంగ్ ఎం52 5జీ రూ.15,000కే లభించనుంది. ఇంకా అమెజాన్ డీల్స్ గురించి కచ్చితమైన సమాచారాన్ని ప్రకటించలేదు. ఇంకా పది రోజుల వ్యవధి ఉన్నందున ఆఫర్ సేల్ సమీపించే కొద్దీ ఆకర్షణమైన డీల్స్ ను అమెజాన్ వెల్లడించనుంది. మరోవైపు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ కూడా ఇంచుమించు ఇవే తేదీల్లో మొదలు కావచ్చు. ఫ్లిప్ కార్ట్ నుంచి ఇంకా తేదీలపై ప్రకటన విడుదల కాలేదు.
Go Back to Shorts
Amazon
Great Indian Festival sale
september 23
offers

More Telugu News