ఆగస్టు మాసంలో తిరుమల శ్రీవారి ఆదాయం రూ.140 కోట్లు... చరిత్రలో ఇదే అత్యధికం
- తగ్గిన కరోనా సంక్షోభం
- తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ
- ఆగస్టులో స్వామివారిని దర్శించుకున్న 22 లక్షల మంది
- స్వామివారికి హుండీ ద్వారా భారీ ఆదాయం
ఆగస్టులో తిరుమల వెంకన్నను 22.22 లక్షల మంది దర్శించుకోగా, 1.05 కోట్ల లడ్డూలు విక్రయించారు. స్వామివారికి ఈ ఏడాది జులై మాసంలో హుండీ ద్వారా రూ.139.45 కోట్ల ఆదాయం రాగా, అంతకుముందు మే నెలలో రూ.130.50 కోట్ల ఆదాయం లభించింది.