SBI Card: ఆన్ లైన్ కొనుగోళ్లపై క్యాష్ బ్యాక్.. ఎస్ బీఐ క్రెడిట్ కార్డు ఆఫర్

  • అన్ని ఆన్ లైన్ కొనుగోళ్ల లావాదేవీలపై 5 శాతం క్యాష్ బ్యాక్
  • ఇలా ఒక నెలలో గరిష్ఠంగా రూ.10 వేల క్యాష్ బ్యాక్
  • ఆఫ్ లైన్ కొనుగోళ్లపై ఒక శాతం క్యాష్ బ్యాక్
SBI Card launches CASHBACK SBI Card with 5 percent cashback for customers

ఆన్ లైన్ లో ఎక్కువగా కొనుగోళ్లు చేసే వారి కోసం ఎస్ బీఐ మంచి ఆఫర్ తీసుకొచ్చింది. ‘క్యాష్ బ్యాక్ ఎస్ బీఐ కార్డు’ను ప్రవేశపెట్టింది. ఆన్ లైన్ లో అన్ని కొనుగోళ్లపైనా ఫ్లాట్ గా 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అంతేకాదు, ఒక ఏడాదిలో విమానాశ్రయాల్లో నాలుగు సార్లు డొమెస్టిక్ లాంజ్ లలో ఉచిత ప్రవేశం లభిస్తుంది. ఆఫ్ లైన్ లో చేసే కొనుగోళ్లపై ఒక శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

ఈ కార్డు రెన్యువల్ కోసం వార్షిక ఫీజు రూ.999. దీనికి 18 శాతం జీఎస్టీ అదనం. కాకపోతే కార్డు ద్వారా ఒక ఏడాదిలో రూ.2 లక్షలు ఖర్చు చేసిన వారికి వార్షిక ఫీజు మినహాయిస్తారు. క్యాష్ బ్యాక్ ఎస్ బీఐ కార్డును 2023 మార్చి లోపు తీసుకున్న వారికి మొదటి ఏడాది వార్షిక ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది. 

ఇక ఆన్ లైన్ లో చేసే కొనుగోళ్లు అన్నింటిపైనా 5 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది కానీ, దీనికి పరిమితి ఉంది. ఒక నెలలో ఇలా వచ్చే క్యాష్ బ్యాక్ రూ.10,000కే పరిమితం. అంటే రూ.2 లక్షల కొనుగోళ్లపై 5 శాతం క్యాష్ బ్యాక్ కింద రూ.10,000 లభిస్తాయి. కానీ, అంతకుమించి కొనుగోలు చేస్తే క్యాష్ బ్యాక్ రాదు.

More Telugu News