Donald Trump: మోదీపై ప్రశంసలు కురిపించిన డొనాల్డ్ ట్రంప్

Trump Says PM Modi A Great Guy
  • మోదీ అద్భుతంగా పని చేస్తున్నారన్న ట్రంప్
  • ఇండియాకు తానే మంచి స్నేహితుడినని వ్యాఖ్య
  • మోదీ చాలా మంచి వ్యక్తి అని కితాబు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధాని మోదీకి ఉన్న స్నేహం అందరికీ తెలిసిందే. గత అధ్యక్ష ఎన్నికల సమయంలో కూడా ట్రంప్ ను గెలిపించేందుకు మోదీ తన వంతు కృషి చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని మోదీ అద్భుతంగా పని చేస్తున్నారని కితాబునిచ్చారు. ఇండియాకు తనకంటే మంచి ఫ్రెండ్ లేడని చెప్పారు. తద్వారా 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల బరిలో తాను నిలబడబోతున్నాననే సంకేతాన్ని ఇచ్చారు. 

అన్ని పోల్స్ లోనూ తాను లీడింగ్ లో ఉన్నానని... అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడంపై త్వరలోనే తాను క్లారిటీ ఇస్తానని ట్రంప్ చెప్పారు. జో బైడెన్, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ లలో భారత్ కు ఎవరు మంచి మిత్రుడనే ప్రశ్నకు సమాధానంగా... ఈ ప్రశ్నను మోదీని అడగాలని సరదాగా అన్నారు. తన వరకైతే భారత్ తో ట్రంప్ కంటే ఎక్కువ స్నేహం ఎవరూ చేయలేదని చెప్పగలనని తెలిపారు. భారత్ తో, మోదీతో తనకు బలమైన అనుబంధం ఉందని చెప్పారు. భారత ప్రధాని పదవిని నిర్వహించడం ఆషామాషీ కాదని... మోదీ అద్భుతంగా పాలిస్తున్నారని అన్నారు. మోదీ చాలా మంచి వ్యక్తి అని చెప్పారు.
Donald Trump
USA
Narendra Modi
BJP

More Telugu News