USA: రికార్డు స్థాయిలో భారత విద్యార్థులకు అమెరికన్ వీసాలు

US issues 82000 student visas to Indians in 2022 higher than any previous year
  • ఇప్పటి వరకు 82,000 వీసాల మంజూరు
  • మరే సంవత్సరంతో పోల్చినా అత్యధికం
  • వివరాలు విడుదల చేసిన ఢిల్లీలోని యూఎస్ ఎంబసీ
ఈ ఏడాది భారత విద్యార్థులకు అమెరికా పెద్ద మొత్తంలో విద్యార్థి వీసాలు మంజూరు చేసింది. 2022లో ఇప్పటి వరకు 82,000 స్టూడెంట్ వీసాలు జారీ అయ్యాయి. ఇంత వరకు ఏ సంవత్సరంలోనూ ఈ స్థాయిలో వీసాలు లభించలేదు. మరే ఇతర దేశంతో పోల్చి చూసినా విద్యార్థి వీసాల విషయంలో భారత విద్యార్థులే ముందున్నారు.

ఢిల్లీలోని యూఎస్ ఎంబసీ, చెన్నై, హైదరాబాద్, కోల్ కతా, ముంబైలోని అమెరికా కాన్సులేట్లు ఈ ఏడాది మే నెల నుంచి ఆగస్ట్ వరకు స్టూడెంట్ వీసా దరఖాస్తులను ప్రాధాన్య క్రమంలో పరిష్కరించాయి. అర్హులైన విద్యార్థులు అందరికీ అవకాశం కల్పించాలన్నదే దీని వెనుక ఉద్దేశ్యం.

 ‘‘ఈ వేసవిలో భారత విద్యార్థులకు రూ.82,000 వీసాలు మంజూరు చేశాం. మరే ఇతర సంవత్సరంతో పోల్చి చూసినా ఇదే ఎక్కువ. ఉన్నత విద్య కోసం భారతీయ కుటుంబాలు ఎక్కువగా అమెరికానే ఎంపిక చేసుకుంటున్నట్టు తెలుస్తోంది’’ అని యూఎస్ ఎంబసీ ప్రకటన విడుదల చేసింది. ఎక్కువ మంది విద్యార్థులు వీసాలను పొంది, ఎంపిక చేసుకున్న యూనివర్సిటీల్లో చేరుతుండడం పట్ల హర్షం వ్యక్తం చేసింది.
USA
student visas
82000
Indian students

More Telugu News