Chiranjeevi: పుకార్లు నమ్మొద్దు .. 'గాడ్ ఫాదర్' రిలీజ్ విషయంలో క్లారిటీ ఇచ్చిన మేకర్స్ !

  • 'గాడ్ ఫాదర్' గా చిరంజీవి 
  • కీలకమైన పాత్రల్లో సల్మాన్, నయన్ 
  • సంగీత దర్శకుడిగా తమన్ 
  • అక్టోబర్ 5వ తేదీన భారీ రిలీజ్
God Father movie upadate

చిరంజీవి కథానాయకుడిగా మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' సినిమా రూపొందింది. ఎన్వీ ప్రసాద్ .. ఆర్.బి. చౌదరి నిర్మించిన ఈ సినిమాకి చరణ్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. మలయాళంలో ఆ మధ్య వచ్చిన మోహన్ లాల్ 'లూసిఫర్' సినిమాకి ఇది రీమేక్. అవినీతి రాజకీయాల చుట్టూ అల్లుకున్న కథ ఇది.

అలాంటి ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. అయితే ఆ రోజున ఈ సినిమా విడుదలయ్యే అవకాశం లేదనీ, రిలీజ్ డేట్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారనే టాక్ రెండు రోజులుగా షికారు చేస్తోంది. ఈ ప్రచారం మరింత ఊపందుకుంటూ ఉండటంతో మేకర్స్ రంగంలోకి దిగారు. 

 పుకార్లను నమ్మొద్దనీ .. ముందుగా చెప్పినట్టుగా ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీనే విడుదల కానుందని స్పష్టం చేశారు.  తాజాగా నయనతార పాత్రను పరిచయం చేసే పోస్టర్ ను రిలీజ్ చేస్తూ, ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ..  సత్యదేవ్ .. సముద్రఖని .. మురళీశర్మ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు..

More Telugu News