'యశోద' నుంచి టీజర్ రెడీ!
- 'యశోద'గా ప్రధానమైన పాత్రలో సమంత
- కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్
- ఈ నెల 9న సాయంత్రం టీజర్ రిలీజ్
- సంగీత దర్శకుడిగా మణిశర్మ
ఈ సినిమా నుంచి ఈ నెల 9వ తేదీన సాయంత్రం 5:49 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. భయం .. బాధతో కూడిన ఎక్స్ ప్రెషన్ తో సమంత ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. టైటిల్ దగ్గర నుంచి ఈ సినిమా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తూ వస్తోంది.
శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి హరి శంకర్ - హరి నారాయణ్ దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి హైలైట్ అవుతుందని అంటున్నారు. రావు రమేశ్ .. మురళీ శర్మ .. ఉన్నిముకుందన్ .. సంపత్ రాజ్ .. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.