Brahmastra Movie: బాలీవుడ్ కు మరో షాక్.. రణబీర్ కపూర్, అలియా భట్ ల 'బ్రహ్మాస్త్ర'పై ఉమైర్ సంధూ ఫస్ట్ రివ్యూ

Umair Sandhu first review on Ranbir Kapoor Alia Bhatt Brahmastra movie

  • ఈ నెల 9న ఐదు భాషల్లో విడుదలవుతున్న 'బ్రహ్మాస్త్ర'
  • సినిమాలో ఆత్మ లోపించిందన్న ఉమైర్ సంధు
  • ఓపెనింగ్ రోజున, వీకెండ్ లో వసూళ్లు వస్తాయని వ్యాఖ్య
  • ఆ తర్వాత సినిమాకు కష్టాలు తప్పవన్న సంధు
  • స్టోరీ, స్క్రీన్ ప్లే యావరేజ్ గా ఉన్నాయంటూ రివ్యూ

ఇటీవలి కాలంలో బాలీవుడ్ కు టైమ్ ఏమాత్రం బాగున్నట్టు లేదు. పెద్ద పెద్ద స్టార్ల సినిమాలు కూడా బాక్సాఫీస్ ముందు బోల్తా పడుతున్నాయి. ఇదే సమయంలో సౌత్ సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఈ నేపథ్యంలో రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన 'బ్రహ్మాస్త్ర' చిత్రంపై బాలీవుడ్ చాలా ఆశలు పెట్టుకుంది. 

విజువల్ వండర్ గా ఈ సినిమాను దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. రూ. 410 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. కరణ్ జొహార్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల కాబోతోంది. ఈ నెల 9న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా తెలుగు వర్షన్ కోసం మెగాస్టార్ చిరంజీవి, దర్శక దిగ్గజం రాజమౌళి రంగంలోకి దిగారు. 

మరోవైపు, 'బ్రహ్మాస్త్ర'కు సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఈ సినిమాను చూసిన ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు, బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు తన రివ్యూను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ సినిమాలో ఆత్మ లోపించిందని ఒక్క ముక్కలో ఆయన తేల్చేశాడు. ఈ సినిమాకు చేసిన భారీ పబ్లిసిటీ... ఓపెనింగ్ రోజున, వీకెండ్ లో వసూళ్లను రాబట్టొచ్చని.... ఆ తర్వాత సినిమాకు కష్టాలు తప్పవని అన్నాడు. మెరిసేదంతా బంగారం కాదని చెప్పాడు. 

ఫాంటసీ, అడ్వెంచర్ సినిమాలు బాలీవుడ్ లో చాలా తక్కువగా వస్తుంటాయని.... ఇలాంటి సినిమాను తెరకెక్కించినందుకు అయాన్ ముఖర్జీని ప్రశంసించాల్సిందేనని ఉమైర్ సంధూ చెప్పాడు. అయితే, ఈ చిత్రంలో స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా యావరేజ్ గా ఉన్నాయని తెలిపాడు. సినిమా కొన్ని చోట్ల గజిబిజీగా అనిపిస్తుందని చెప్పాడు. ఈ చిత్రంలో రణబీర్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాడని తెలిపాడు. ఏం జరుగుతోందో కూడా తెలియని విధంగా రణబీర్ ఉన్నాడని చెప్పాడు. అలియా భట్ స్టన్నింగ్ గా ఉందని ప్రశంసించాడు. 

మౌని రాయ్ పాత్ర గగుర్పాటుకు గురి చేసే విధంగా ఉందని, ఆమె పాత్ర, పర్మామెన్స్ చాలా బాగుందని చెప్పాడు. అమితాబ్ నటన ఎప్పటిలాగానే చాలా అద్భుతంగా ఉందని... అయితే, ఆయన పాత్ర నిడివి తక్కువగా ఉండటం ఒక డ్రాబ్యాక్ అని తెలిపాడు. సినిమాలో వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉందని.. రెండు, మూడు సీక్వెన్సులు చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయని చెప్పాడు. మొత్తం మీద ఈ చిత్రానికి ఉమైర్ సంధూ 5 పాయింట్లకు గాను 2.5 పాయింట్లు వేశాడు.

Brahmastra Movie
Bollywood
First Review
Umair Sandhu
Ranbir Kapoor
Alia Bhatt
Amitabh Bachchan
Tollywood
Chiranjeevi
Rajamouli
  • Loading...

More Telugu News