Sita Ramam: అమెజాన్​ ప్రైమ్​లోకి 'సీతారామం'.. స్ట్రీమింగ్​ ఎప్పటి నుంచి అంటే!

  • గత నెల 5న విడుదలై భారీ విజయం సొంతం
  • తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో మంచి రెస్పాన్స్
  • రూ. 80 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన చిత్రం
  • ఈ నెల 9 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టు అమెజాన్ ప్రైమ్
    ప్రకటన 
Sita Ramam On Prime from Sept 9

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. చిన్న సినిమాగా ఆగస్టు 5 విడుదలై తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో ఆకట్టుకుంది. మంచి కథ, కథనంతో ప్రేక్షకులను మెప్పించింది. 

దాంతో, విడుదలైన మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే రూ. 80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఓవర్సీస్ లో అయితే ఈ సినిమాకు మరింతగా ఆదరణ లభిస్తోంది. రష్మిక మందన్న, సుమంత్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని స్వప్నా సినిమాస్, వైజయంతి మూవీస్ బ్యానర్స్ పై సి. అశ్వనీదత్  నిర్మించారు.
 
విడుదలై నెల కావస్తున్నప్పటికీ ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తూనే ఉంది. మరోవైపు ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ క్రమంలో ఓటీటీ విడుదల తేదీని అమెజాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 9 నుంచి అమెజాన్ ప్రైమ్‌ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్స్ లో సినిమా అందుబాటులో ఉంటుందని అమెజాన్ తెలిపింది. థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడలేపోతున్న వాళ్లు మరో మూడు రోజులు ఆగితే ఎంచక్కా ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయొచ్చు.

More Telugu News