డిస్నీ హాట్ స్టార్ కి 'విక్రాంత్ రోణా'
- 'విక్రాంత్ రోణా' గా సుదీప్
- జులైలో థియేటర్లకు వచ్చిన సినిమా
- అడ్వెంచర్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
- ఈ నెల 16 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్
జులై 28వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. అజనీశ్ లోకనాథ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ హాట్ స్టార్ వారు దక్కించుకున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలారు. పోలీస్ ఆఫీసర్ గా సుదీప్ నటించిన ఈ సినిమాలో జాక్విలిన్ .. నీతా అశోక్ .. రవిశంకర్ గౌడ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఓటీటీ ద్వారా ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందనేది చూడాలి.