Andhra Pradesh: మూడు సినిమాలతో ప్రభాస్ బిజీ.. 'సలార్' దర్శకుడి ఆందోళన

Director Prashanth Neel feeling little unsatisfactory on Prabhas look
  • ప్రస్తుతం ఒకేసారి మూడు చిత్రాల్లో నటిస్తున్న ప్రభాస్
  • యాక్షన్ మూవీ 'సలార్'లో ప్రభాస్ ఫిజిక్ కు అత్యంత ప్రాధాన్యత 
  • మూడు సినిమాల నేపథ్యంలో ప్రభాస్ కు లుక్ ను క్రమ పద్ధతిలో ఉంచుకోవడంలో కష్టమవుతున్న వైనం
వరుసగా రెండు సినిమాలు అంచనాలను అందుకోకపోయినా... పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు. వందల కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రభాస్ సినిమాలపై పెట్టేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. నార్త్ లో సైతం ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోవడంతో... ప్రభాస్ తో సినిమాలు చేయడానికి దర్శక, నిర్మాతలు ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు. ప్రభాస్ కూడా వరుసపెట్టి సినిమాలకు సైన్ చేస్తున్నాడు. 

ప్రస్తుతం మన యంగ్ రెబల్ స్టార్ ఒకేసారి మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు. వీటిలో 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న 'సలార్', నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న 'ప్రాజెక్ట్ కే'తో పాటు బాలీవుడ్ లో తెరకెక్కుతున్న 'ఆదిపురుష్' ఉన్నాయి. మరోవైపు, ఇన్ని సినిమాలలో ప్రభాస్ ఒకేసారి నటిస్తుండటంపై ప్రశాంత్ నీల్ కొంత అసంతృప్తితో ఉన్నారని ఫిలింనగర్ టాక్.

'సలార్' చిత్రం మొత్తం పూర్తి యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంటుంది. దీంతో, ఈ చిత్రంలో ప్రభాస్ ఫిజిక్ కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. 'కేజీఎఫ్'లో యష్ మాదిరి ఫిజిక్ ను మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. అయితే, ప్రభాస్ మూడు సినిమాల కోసం ప్రయాణాలు చేస్తుండటంతో.. లుక్ ను క్రమ పద్ధతిలో ఉంచుకోవడం కష్టమవుతోంది. ఈ కారణంగానే ప్రశాంత్ నీల్ కొంత అసంతృప్తితో ఉన్నారని చెపుతున్నారు.
Andhra Pradesh
Prashanth Neel
Salaar
Tollywood
Bollywood
Look

More Telugu News