TTD: అహ్మ‌దాబాద్‌లోనూ వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యం... స్థ‌లమిస్తామ‌న్న గుజ‌రాత్ సీఎం

ttd chairman states that will construct sri venkateswara swamy tenple in ahmedabad
  • గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన వైవీ సుబ్బారెడ్డి
  • టీటీడీ స‌భ్యుడు కేత‌న్ దేశాయ్‌తో క‌లిసి గుజ‌రాత్ సీఎంతో భేటీ
  • అహ్మ‌దాబాద్‌లో వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యాన్ని నిర్మిస్తామ‌న్న సుబ్బారెడ్డి
శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి కొలువైన తిరుమ‌ల కొండ పాల‌నా వ్య‌వ‌హారాల ప‌ర్య‌వేక్ష‌ణ కోసం ఏర్పాటైన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి సోమ‌వారం గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. టీటీడీ పాల‌క మండలి సభ్యుడు కేత‌న్ దేశాయ్‌తో క‌లిసి ఆయ‌న గాంధీ న‌గ‌ర్‌లో గుజ‌రాత్ సీఎం భూపేంద్ర ప‌టేల్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా అహ్మ‌దాబాద్‌లో టీటీడీ ఆధ్వ‌ర్యంలో వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యం ఏర్పాటుపై చ‌ర్చ జ‌రిగింది.

గుజ‌రాత్ వాణిజ్య రాజ‌ధాని అహ్మ‌దాబాద్‌లో శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌య ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని వైవీ సుబ్బారెడ్డి చెప్ప‌గా... ఆల‌య నిర్మాణం కోసం అనువైన భూమిని కేటాయిస్తామ‌ని భూపేంద్ర ప‌టేల్ తెలిపారు. దీంతో అహ్మ‌దాబాద్‌లో వెంటేశ్వ‌ర స్వామి ఆల‌యాన్ని నిర్మిస్తామ‌ని సుబ్బారెడ్డి ప్ర‌క‌టించారు.
TTD
YV Subba Reddy
YSRCP
Gujarat
Ahmedabad
Sri Venkateswara Swamy Temple
Bhupendra Patel

More Telugu News