Hollywood: బ్యాట్ మ్యాన్ చిరంజీవి.. ముఠామేస్త్రి సినిమా పాట క్లిప్ ను షేర్ చేసిన హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్.. వైరల్ ట్వీట్ ఇదిగో

Hollywood director James gunn shares Mutamestri song clip
  • ముఠామేస్త్రి సినిమాలోని పాటలో బ్యాట్ మ్యాన్ వేషమేసిన చిరంజీవి
  • ఒకప్పుడు బ్యాట్ మ్యాన్.. తర్వాత ది బ్యాట్ మ్యాన్.. ఇప్పుడు మిస్టర్ బ్యాట్ మ్యాన్ అంటూ సరదాగా షేర్ చేసిన జేమ్స్ గన్
  • ట్విట్టర్ లో వైరల్ గా మారిన వీడియో
ఇటీవల బ్యాట్ మ్యాన్ సినిమా విడుదలైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. బాగానే వసూళ్లు సాధించింది. ఈ క్యారెక్టర్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే ఇప్పుడు అప్పుడు కాదు ఏకంగా దాదాపు 30 ఏళ్ల కిందే ఓ బ్యాట్ మ్యాన్ ఉన్నాడంటూ హాలీవుడ్ ప్రఖ్యాత డైరెక్టర్ జేమ్స్ గన్ ట్వీట్ చేసిన ఓ వీడియో మాత్రం వైరల్ గా మారింది. ఇంతకీ ఆ బ్యాట్ మ్యాన్ ఎవరో తెలుసా? మన మెగాస్టార్ చిరంజీవి. ముఠామేస్త్రి సినిమాలోని ఓ పాటలో చిరంజీవి బ్యాట్ మ్యాన్ కాస్ట్యూమ్స్ లో డ్యాన్స్ చేశారు.

ఎవరా డైరెక్టర్..?
హాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో జేమ్స్ గన్ ఒకరు. ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలక్సీ’ సిరీస్ సినిమాలు, ‘సూసైడ్ స్క్వాడ్’ సినిమా ఆయన దర్శకత్వంలో వచ్చినవే. ఆయన చిరంజీవి పాటలోని భాగాన్ని రిలీజ్ చేస్తూ.. ‘మొదట్లో ఒక బ్యాట్ మ్యాన్.. తర్వాత ఒక్కడే బ్యాట్ మ్యాన్.. ఇప్పుడు మిస్టర్ బ్యాట్ మ్యాన్.. (బ్యాట్ మ్యాన్ ఎక్కడికక్కడ మారిపోతూ వస్తున్నాడు అన్న అర్థంలో..)’ అంటూ సరదాగా కామెంట్ చేశారు.  
  • జేమ్స్ గన్ ట్వీట్ చేసిన వీడియోకు ఏకంగా 20 లక్షలకుపైగా వ్యూస్, 30 వేల వరకు లైకులు వచ్చాయి. పెద్ద సంఖ్యలో రీట్వీట్ చేయడం గమనార్హం. 
  • 1993 జనవరి 17నలో విడుదలైన ముఠామేస్త్రి సినిమా చిరంజీవితోపాటు మీనా, రోజా ప్రధాన తారాగణంగా తెరకెక్కింది. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు.

Hollywood
James Gunn
Mutamestri
Chiranjeevi
Tollywood
Movie news

More Telugu News