తెలంగాణలో తాజాగా 102 మందికి కరోనా

Telangana corona update
  • గత 24 గంటల్లో 8,456 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 60 మందికి పాజిటివ్
  • పలు జిల్లాల్లో కొత్త కేసులు నిల్
  • కరోనా నుంచి కోలుకున్న 175 మంది
  • ఇంకా 1,116 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 8,456 కరోనా పరీక్షలు నిర్వహించగా, 102 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాదులో అత్యధికంగా 60 కేసులు వెల్లడయ్యాయి. పలు జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. మరో 60 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అదే సమయంలో 175 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు. 

తెలంగాణలో ఇప్పటివరకు 8,35,067 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,29,840 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,116 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.
Go Back to Shorts
Telangana
Corona Virus
Update
Positive Cases
Recoveries

More Telugu News