గుమ్మడి పండుతో బోటు చేసుకుని.. 38 మైళ్లు నదిలో ప్రయాణం.. గిన్నిస్ రికార్డు పట్టేశాడు!
- అమెరికాలోని మిస్సోరీ నదిలో ఓ పెద్దాయన సాహసం
- తన పుట్టిన రోజున ప్రత్యేకంగా ఫీట్ చేసిన డ్యూన్ హాన్సెన్
- ఒంటరిగా 10 గంటలకుపైగా ప్రయాణించి లక్ష్యాన్ని చేరుకున్న తీరు
పాత రికార్డును బ్రేక్ చేస్తూ..
- గుమ్మడి పండు బోట్ లో నదిలో ప్రయాణించిన రికార్డు ఇంతకు ముందు వాషింగ్టన్ కు చెందిన రిక్ స్వెన్సన్ అనే వ్యక్తి పేరు మీద ఉంది. అతను 2016లో రెడ్ రివర్ నదిలో 25.5 మైళ్ల దూరం అలా ప్రయాణించాడు.
- ఆ రికార్డును బీట్ చేయాలని డ్యూన్ హాన్సెన్ నిర్ణయించుకున్నాడు. ఓ పెద్ద గుమ్మడి పండు తెప్పించుకుని.. దాని లోపలి భాగమంతా తొలగించి చిన్న బోటులా మార్చుకున్నాడు. దాని లోపల కొన్ని అత్యవసరమైన సామగ్రి వేసుకుని, తెడ్డు పట్టుకుని నదిలో ప్రయాణించడం మొదలుపెట్టాడు.
- బెల్లూవ్స్ గ్రామం నుంచి నెబ్రస్కా పట్టణం వరకు 38 మైళ్ల దూరం ఈ గుమ్మడి పండు బోటులో డ్యూన్ ప్రయాణించాడు. పొద్దున 7.30కు బయలుదేరితే.. సాయంత్రం 6.30 గంటలకు చేరుకున్నాడు.
- ఎవరి సాయం లేకుండా ఒక్కడే తెడ్డు సాయంతో ప్రయాణిస్తూ వచ్చాడు. దీనంతటినీ గిన్నిస్ బుక్ ప్రతినిధులు పరిశీలించారు. మొత్తానికి పెద్దాయన సాధించేశాడు అంటూ రికార్డు ఇచ్చేశారు.