BJP: ఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ముస్లిం మహిళ.. ఫత్వా జారీ

BJPs Muslim leader Ruby Khan brings home Ganpati for 7 days Maulana issues fatwa
  • అలీగఢ్ బీజేపీ మహిళా మోర్చా మండల ఉపాధ్యక్షురాలిగా రూబీ ఖాన్
  • ఇంట్లో గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు
  • ఫత్వాలకు భయపడబోనన్న రూబీ ఖాన్
  • అందరూ కలిసి నడవాలని ఇస్లాం బోధిస్తోందన్న ఆమె కుటుంబ సభ్యులు
ఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్న ముస్లిం మహిళపై దేవబంద్ ముఫ్తీ ఫత్వా జారీ చేశారు. అలీగఢ్‌కు చెందిన ముస్లిం మహిళ రూబీ అసిఫ్ ఖాన్‌ వినాయక చవితి సందర్భంగా తన ఇంట్లో గణనాథుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను హిందువుల పండుగలన్నీ జరుపుకుంటానని తెలిపారు. 

విషయం వెలుగులోకి రావడంతో దేవబంద్‌కు చెందిన ముఫ్తీ అర్షద్ ఫరూఖీ.. రూబీఖాన్‌కు ఫత్వా జారీ చేశారు. అలీగఢ్ బీజేపీ మహిళా మోర్చా మండల ఉపాధ్యక్షురాలైన రూబీఖాన్ తనపై జారీ అయిన ఫత్వాపై మాట్లాడుతూ.. ఇలాంటి వాటికి తాను భయపడబోనన్నారు. అందరూ కలిసి నడవాలని, ఇస్లాం కూడా అదే బోధిస్తోందని రూబీ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

BJP
Ruby Khan
Ganapai
Fatwa
Uttar Pradesh

More Telugu News