యుద్ధం చేయాలంటూ టీడీపీ నేతలను, కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొడుతున్నాడు: మంత్రి జోగి రమేశ్ ఆరోపణ
- బాబును సొంత పార్టీ వాళ్లే నమ్మడంలేదన్న జోగి రమేశ్
- కార్యకర్తలను బలిచేయాలని చూస్తున్నాడని విమర్శలు
- కుప్పంలో కుదేలయ్యాడంటూ ఎద్దేవా
- పులివెందులను తాకే దమ్ముందా? అంటూ సవాల్
రెండు లక్షల కోట్ల అవినీతి అంటూ ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు, ఆ ఆంశంపై చర్చలకు రాగలరా? అని ప్రశ్నించారు. ఒకవేళ చర్చా వేదిక ఎక్కడో చెబితే తామే వస్తామని స్పష్టం చేశారు. డీబీటీ ద్వారా తాము రూ.1.70 లక్షల కోట్లు నేరుగా ప్రజలకు అందించామని జోగి రమేశ్ వెల్లడించారు. అవినీతి కేసుల విచారణ జరగనివ్వకుండా స్టే తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు దమ్ముంటే వాటిపై విచారణ జరిపించుకోవాలని సవాల్ విసిరారు.