Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఐదు భాషల్లో ‘ధమ్కీ’ ఇవ్వనున్న విష్వక్సేన్

VishwakSen Dhamki Releasing in 5 Languages
  • స్వీయదర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తున్న యువ హీరో
  • దీపావళికి ఫస్ట్ లుక్, టీజర్ వస్తాయన్న విష్వక్సేన్
  • హీరోయిన్ గా నటిస్తున్న నివేదా పేతురాజ్ 
తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విష్వక్సేన్. మాస్ సినిమాలతో పాటు క్లాస్ సినిమాలతో పాటు ఆకట్టుకుంటున్నాడు. ఈ మధ్యే ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’తో మంచి హిట్ అందుకున్నాడు. అతని చేతిలో ఇప్పుడు చాలా సినిమాలున్నాయి. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా విష్వక్ తనను తాను నిరూపించుకున్నాడు. 

కెరీర్ ఆరంభంలోనే  ‘ఫలన్ నుమా దాస్’ చిత్రంతో మెప్పించాడు. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా.. దర్శకుడిగా మాత్రం అతనికి మంచి మార్కులు లభించాయి. ఇప్పుడు విష్వక్సేన్ మరోసారి మెగాఫోన్ పట్టాడు. ‘ఫలక్నుమా దాస్’కు కొనసాగింపుగా ‘దాస్ కా ధమ్కీ’ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. హీరోగా నటించడంతో పాటు తనే  నిర్మిస్తున్నాడు. 

 నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. రోహిణి, రావు రమేశ్, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రొమాన్స్, కామెడీ కలిసిన యాక్షన్ థ్రిల్లర్ గా  వస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. కేవలం యాక్షన్ ఎడిసోడ్ మిగిలుంది. బల్గేరియా ఫైట్‌ మాస్టర్స్ టొడొర్ లజరావ్, జుజిల నేతృత్వంలోని యాక్షన్ సీక్వెల్స్ సారథి స్టూడియోస్‌లో వేసిన సెట్స్ లో చిత్రీకరిస్తున్నారు. 

ఇటీవల వచ్చిన ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రానికి వీళ్లే ఫైట్స్ సమకూర్చారు.  ఫస్ట్ లుక్, టీజర్‌‌లను దీపావళికి రిలీజ్ చేస్తామని విష్వక్సేన్ తెలిపాడు. ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తామన్నాడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్న భాషల్లోనూ సినిమాని విడుదల చేస్తున్నట్టు తెలిపాడు. దాంతో నిఖిల్ సిద్ధార్థ్, విజయ్ దేవరకొండ బాటలో విష్వక్సేన్ కూడా ప్యాన్ ఇండియా స్టార్ కాబోతున్నాడన్న మాట!
Tollywood
VishwakSen
Dhamki
movie
releasing
5 languages

More Telugu News