ఆండ్రాయిడ్ భవిష్యత్ వెర్షన్లలో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆండ్రాయిడ్ భవిష్యత్ వెర్షన్లలో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్

Satellite connectivity feature will be in future android version as per google
  • ఐఫోన్-14లో శాటిలైట్ కనెక్టివిటీ ఉంటుందని ప్రచారం
  • ఆండ్రాయిడ్ రాబోయే వెర్షన్ లో శాటిలైట్ ఫీచర్ ఉంటుందన్న గూగుల్
  • ఆండ్రాయిడ్ 14లో కొత్త ఫీచర్ ఉండే అవకాశం
  • నెట్వర్క్ లేకపోయినా కాల్స్, ఎస్సెమ్మెస్ లు
శాటిలైట్ ఫోన్ల తరహాలో సిగ్నల్ టవర్లతో పనిలేకుండా నేరుగా శాటిలైట్ల నుంచే మొబైల్ ఫోన్లు సిగ్నల్ ను అందుకుంటే..! అయితే ఇదేమీ అసాధ్యం కాదని గూగుల్ అంటోంది. త్వరలోనే ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్లలో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ ను తీసుకురానున్నట్టు ఈ టెక్ దిగ్గజం వెల్లడించింది. బహుశా ఆండ్రాయిడ్ 14లో ఈ అత్యాధునిక ఫీచర్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. 

దీనిపై ఆండ్రాయిడ్ సీనియర్ ఉపాధ్యక్షుడు హిరోషి లోషిమెర్ స్పందించారు. ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ లో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఫీచర్ ను ఎనేబుల్ చేసుకుంటే, నెట్వర్క్ అందుబాటులో లేకపోయినా, నేరుగా శాటిలైట్ తో అనుసంధానమై ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు, ఎస్సెమ్మెస్ లు పంపుకోవచ్చు. కాగా, ఐఫోన్-14 మోడల్స్ లో శాటిలైట్ కనెక్టివిటీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత లేదు.
Satellite Connectivity
Android-14
Google
New Feature

More Telugu News