Telangana: కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ విమోచ‌న దినం.. హాజ‌రు కానున్న అమిత్ షా

union government organises this years telangana vimochana dinam
  • ప‌రేడ్ గ్రౌండ్స్‌లో జ‌ర‌గ‌నున్న కార్య‌క్ర‌మం
  • అమిత్ షాతో పాటు మ‌హారాష్ట్ర, క‌ర్ణాట‌క సీఎంల హాజ‌రు
  • అధికారుల‌తో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి స‌మీక్ష‌
తెలంగాణ విమోచ‌న దినాన్ని ఈ ఏడాది కేంద్ర ప్ర‌భుత్వం అధికారికంగా నిర్వ‌హించ‌నుంది. ఈ కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన ఏర్పాట్లపై కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి కేంద్ర ప్ర‌భుత్వంలోని ప‌లు శాఖ‌ల‌కు చెందిన అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఏటా సెప్టెంబ‌ర్ 17న తెలంగాణ విమోచ‌న దినాన్ని పాటిస్తున్న సంగ‌తి తెలిసిందే. నిజాం పాల‌న నుంచి తెలంగాణ‌కు విముక్తి క‌లిగిన సంద‌ర్భాన్ని తెలంగాణ విమోచ‌న దినంగా పాటిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ ఏడాది తెలంగాణ విమోచ‌న దినాన్ని ఈ నెల 17న సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్స్‌లో అధికారికంగా నిర్వ‌హించేందుకు కేంద్రం నిర్ణ‌యించింది. ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు మ‌హారాష్ట్ర, కర్ణాట‌క ముఖ్య‌మంత్రులు ఏక్‌నాథ్ షిండే, బ‌స‌వ‌రాజ్ బొమ్మైలు హాజ‌రు కానున్నారు.
Telangana
BJP
G. Kishan Reddy
Amit Shah
Telangana Vimochana Dinam
Parade Grounds

More Telugu News