ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్‌కు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
- అమలాపురంలో వైఎస్సార్ వర్ధంతికి హాజరైన రవాణా శాఖ మంత్రి
- కార్యక్రమం అనంతరం అస్వస్థతకు గురైన వైనం
- రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు
వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళి అర్పించిన కాసేపటికే విశ్వరూప్ అస్వస్థతకు గురయ్యారు. విశ్వరూప్ పరిస్థితిని గమనించిన పార్టీ శ్రేణులు వెనువెంటనే ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. ఆ తర్వాత విశ్వరూప్‌ను హుటాహుటీన రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఏ కారణం చేత విశ్వరూప్ అస్వస్థతకు గురయ్యారన్న విషయం తెలియరాలేదు.