Raghu Rama Krishna Raju: విజయసాయిరెడ్డిని బ్రోకర్ రెడ్డి అని పిలుస్తున్నారు: రఘురామకృష్ణరాజు

People in Delhi calling Vijayasai Reddy as Broker Reddy says Raghu Rama Krishna Raju
  • జగన్ ఢిల్లీకి వెళ్లి మోదీని కలిశారన్న రఘురాజు 
  • మోదీని ఎందుకు కలిశారో జగన్ కే క్లారిటీ లేదని వ్యాఖ్య 
  • జగన్ ను మందలించడానికే ఢిల్లీకి పిలిపించారని చెప్పుకుంటున్నారన్న రఘురాజు  
వైసీపీ రాజ్యసభ సభ్యుడు వియసాయిరెడ్డిపై ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో బ్రోకర్ పనులు చేసే విజయసాయిరెడ్డిని బ్రోకర్ రెడ్డి అని పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఆగస్ట్ 22న ఢిల్లీకి వెళ్లి మోదీని కలిశారని... ఎందుకు కలిశారో జగన్ కే క్లారిటీ లేదని అన్నారు. లిక్కర్ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రిని మందలించడానికే ఢిల్లీకి మోదీ పిలిపించారని అంటున్నారని చెప్పారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లో అవకతవకలు లేవంటూ పార్టీకి సంబంధించిన పత్రికలో తప్పుడు కథనాలు రాశారని విమర్శించారు.
Raghu Rama Krishna Raju
Jagan
Vijayasai Reddy
YSRCP
Narendra Modi
BJP

More Telugu News