GVL Narasimha Rao: బీజేపీతో జతకట్టి మార్పుకోసం ముందుకెళుతున్న పవన్ కల్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు: జీవీఎల్

BJP leader GVL conveys birthday wishes to Pawan Kalyan
  • నేడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు
  • జనసేనానిపై శుభాకాంక్షల వెల్లువ
  • విషెస్ తెలిసిన జీవీఎల్
  • పొలిటికల్ పవర్ స్టార్ అంటూ ట్వీట్
జనసేనాని, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కూడా పవన్ కు విషెస్ తెలుపుతూ, ట్వీట్ చేశారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని తలపెట్టి, బీజేపీతో జతకట్టి, మార్పు కోసం ముందుకు వెళుతున్న జనసేన అధ్యక్షులు, పొలిటికల్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ స్పందించారు. కలియుగ దైవం వెంకటేశ్వరుడు మీకు ఆయురారోగ్యాలు, మనకు విజయాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తాను అంటూ జీవీఎల్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. 

కొన్నాళ్ల కిందట ఏపీలో బీజేపీ, జనసేన జట్టుకట్టిన సంగతి తెలిసిందే. అయితే, గతకొంతకాలంగా రెండు పార్టీల మధ్య ఉమ్మడి కార్యాచరణ కనిపించడంలేదు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండకపోవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, జీవీఎల్ చేసిన ట్వీట్ కాస్తంత ఆసక్తి కలిగిస్తోంది.
GVL Narasimha Rao
Pawan Kalyan
Birthday
Wishes
BJP
Janasena
Andhra Pradesh

More Telugu News