తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన నిర్మ‌లా సీతారామ‌న్‌... ఘ‌న స్వాగ‌తం ప‌లికిన బీజేపీ శ్రేణులు

union minister nirmala sitharaman arrives for zaheerabad tour
  • జ‌హీరాబాద్ పార్ల‌మెంటు కో ఆర్డినేట‌ర్‌గా నిర్మ‌ల నియామ‌కం
  • నియోజ‌క‌వ‌ర్గ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన కేంద్ర మంత్రి
  • శంషాబాద్ విమానాశ్ర‌యంలో ఘ‌న స్వాగ‌తం ప‌లికిన బీజేపీ శ్రేణులు
  • 3 రోజుల పాటు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్న నిర్మ‌ల‌
 కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ గురువారం తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. తెలంగాణ‌లోని ప‌లు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌కు బీజేపీ అధిష్ఠానం ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను కో ఆర్డినేట‌ర్లుగా నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా జ‌హీరాబాద్ పార్ల‌మెంటు కో ఆర్డినేట‌ర్‌గా నియ‌మితులైన నిర్మ‌లా సీతారామ‌న్ గురువారం నుంచి 3 రోజుల పాటు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ప‌ర్య‌టించ‌నున్నారు.

ఈ ప‌ర్య‌ట‌న నిమిత్తం గురువారం హైద‌రాబాద్ వ‌చ్చిన నిర్మ‌లా సీతారామ‌న్‌కు బీజేపీ శ్రేణులు శంషాబాద్ విమానాశ్ర‌యంలో ఘ‌న స్వాగ‌తం ప‌లికాయి. ఆ త‌ర్వాత శంషాబాద్ నుంచి ఆమె రోడ్డు మార్గం మీదుగా జ‌హీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని కామారెడ్డి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా బీజేపీకి చెందిన మ‌హిళా శ్రేణులు హార‌తితో నిర్మల‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ఆమె నియోజ‌క‌వ‌ర్గ స్థాయి నేత‌ల‌తో భేటీ అయ్యారు. 3 రోజుల పాటు ఆమె నియోజ‌కవ‌ర్గంలోని ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తూ ఆయా ప్రాంతాల స్థానిక నేత‌ల‌తో భేటీ అవుతూ... పార్టీ బ‌లోపేతంపై దిశానిర్దేశం చేయ‌నున్నారు.
Go Back to Shorts
BJP
Telangana
Zaheerabad
Kamareddy
Nirmala Sitharaman

More Telugu News