దేశంలో తొలి గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ విడుదల
- దేశీయంగా అభివృద్ధి చేసిన గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్
- 9 నుంచి 14 సంవత్సరాల వయసున్న బాలికలకు వ్యాక్సినేషన్
- జాతీయ ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా అందించాలని కేంద్రం నిర్ణయం
9 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు ఉన్న బాలికలకు ఈ వ్యాక్సిన్ వేస్తారు. ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ ను జాతీయ ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా కోవిడ్ వర్కింగ్ గ్రూప్, నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ ఛైర్మన్ ఎన్.కే.అరోరా మాట్లాడుతూ... 90 శాతం వరకు గర్భాశయ క్యాన్సర్ నిర్దిష్టమైన వైరస్ వల్ల వస్తుందని.. ఈ వ్యాక్సిన్ ఆ వైరస్ కు వ్యతిరేకంగా పని చేస్తుందని చెప్పారు. ఈ వ్యాక్సిన్ ను తయారు చేసే బాధ్యతను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అప్పగించింది.