ఆసియాకప్: గెలిచిన ఇండియా, ఓడిన పాక్ జట్లకు భారీ జరిమానా!
- భారత్-పాకిస్థాన్ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్
- తప్పిదాన్ని అంగీకరించిన ఇరు జట్ల కెప్టెన్లు
- మ్యాచ్ ఫీజులో 40 శాతాన్ని జరిమానాగా విధించిన ఐసీసీ
ఐసీసీ నియమావళి ప్రకారం తమకు కేటాయించిన సమయానికి ఒక్క ఓవర్ జాప్యమైతే మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. భారత్-పాక్ జట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, బాబర్ ఆజం తమ తప్పును అంగీకరించడంతో విచారణ అవసరం లేదని ఐసీసీ పేర్కొంది. కాగా, ఆసియాకప్లో భాగంగా నేడు భారత్-హాంకాంగ్ జట్లు తలపడనున్నాయి.