Redmi: 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరాతో రూ.13,999కే రెడ్ మి నోట్ 11 ఎస్ఈ ఫోన్.. ప్రత్యేకతలు ఇవిగో!

  • బుధవారం నుంచే విక్రయాలు ప్రారంభించిన షియోమీ సంస్థ
  • కనీసం రూ.13,999 నుంచి ధరలు ప్రారంభమవుతాయని వెల్లడి
  • ఫ్లిప్ కార్ట్ లో ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై డిస్కౌంట్ ఉంటుందని ప్రకటన
Redmi note 11 SE price and specifications

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ కొత్తగా రెడ్ మి నోట్ 11 ఎస్ఈ ఫోన్ ను ఇండియాలో విడుదల చేసింది. 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో వెనుకవైపు మొత్తం నాలుగు కెమెరాల సెటప్ తో.. బడ్జెట్ ధరలో ఈ సరికొత్త ఫోన్ ను విడుదల చేసింది. బుధవారం నుంచే షియోమీ వెబ్ సైట్ తోపాటు ఇతర ఈ కామర్స్ వెబ్ సైట్ల నుంచి ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చని ప్రకటించింది. వివిధ వేరియంట్లు అందుబాటులో ఉండగా.. 6 జీబీ ర్యామ్, 64 జీబీ మెమెరీ వేరియంట్ ధరను రూ.13,999గా ప్రకటించింది. మిగతా వేరియంట్ల ధరలు వేరుగా ఉంటాయని తెలిపింది.

రెడ్ మి నోట్ 11 ఎస్ఈ ప్రత్యేకతలు, ఫీచర్లు ఇవీ..

  • ఈ ఫోన్ లో ఫుల్ హెచ్ డీ ప్లస్ (1,080 x 2,400) రిజల్యూషన్ తో 6.43 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ ప్లే అందుబాటులో ఉంది. ముందువైపు పంచ్ హోల్ తో సెల్ఫీ కెమెరా అమర్చారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణ ఉంది.
  • మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్ తో మాలి జీ76 గ్రాఫిక్స్ ప్రాసెసర్ ను అమర్చారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంను లోడ్ చేశారు.
  • 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. 4కె వీడియోలను తీసుకోవచ్చు. ముందువైపు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది.
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్టు చేస్తుంది.
  • డ్యూయల్ స్టీరియో స్పీకర్ సదుపాయం ఉంది.
  • 8.29 మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉన్న ఈ ఫోన్ బరువు 178.8 గ్రాములు.
  • ఈ ఫోన్ బైఫ్రాస్ట్ బ్లూ, కాస్మిక్ వైట్, స్పేస్ బ్లాక్, థండర్ పర్పుల్ రంగుల్లో అందుబాటులో ఉంది.
  • ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ కొనుగోలుపై ఎక్స్ చేంజ్ ఆఫర్లు ఉన్నాయని.. ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డుదారులు ఈఎంఐ కొనుగోలుపై రూ.1,250 డిస్కౌంట్, సాధారణ కొనుగోలుపై రూ.1,000 డిస్కౌంట్ పొందవచ్చని కంపెనీ ప్రకటించింది.

More Telugu News