లండన్‌లో కుటుంబ సభ్యులతో కలిసి వినాయక చవితి వేడుకల్లో వెంకయ్య... ఫొటోలు ఇవిగో
- లండన్ టూర్ వెళ్లిన వెంకయ్య
- అక్కడే వినాయక చవితి వేడుకల్లో పాలుపంచుకున్న వైనం
- ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన మాజీ ఉపరాష్ట్రపతి
లండన్ లో కుటుంబ సభ్యులతో కలిసి వినాయక చవితి వ్రతాన్ని ఆచరించడం ఆనందాన్ని అందించిందని ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ను పెట్టారు. ప్రజలందరికీ తమతమ రంగాల్లో విజయాలను అందించాలని అంబాసుతుణ్ని ప్రార్థించానంటూ ఆయన పేర్కొన్నారు. చవితి వేడుకల్లో పాలుపంచుకున్న తన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.