ఖైరతాబాద్ మహాగణపతికి తొలిపూజ చేసిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
- నేడు వినాయకచవితి
- ఖైరతాబాద్ లో కొలువైన మహాగణపతి
- స్వామివారిని దర్శించుకున్న గవర్నర్
- తొలిసారిగా ఖైరతాబాద్ లో మట్టి విగ్రహం
- విగ్రహం కోసం రూ.1.50 కోట్లు ఖర్చుచేసిన నిర్వాహకులు
కాగా, ఖైరతాబాద్ లో తొలిసారిగా మట్టితో చేసిన బొజ్జ గణపయ్య విగ్రహం ఏర్పాటు చేశారు. పంచముఖ మహాలక్ష్మి రూపంలో ఉన్న ఈ ఖైరతాబాద్ గణేశ విగ్రహం ఎత్తు 50 అడుగులు. లంబోదరుడికి కుడివైపున శ్రీ షణ్ముక సుబ్రహ్మణ్యస్వామి, ఎడమవైపున శ్రీ త్రిశక్తి మహాగాయత్రీ దేవి కొలువుదీరారు. ఈ భారీ విగ్రహం తయారీకి రూ.1.50 కోట్లు ఖర్చయినట్టు నిర్వాహకులు తెలిపారు.