ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో మరోసారి చుక్కెదురు... బెయిల్ పిటిషన్ కొట్టివేత
- డ్రైవర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న అనంతబాబు
- మూడోసారి బెయిల్ పిటిషన్ కొట్టివేత
- ప్రస్తుతం తల్లి మరణం నేపథ్యంలో బెయిల్ పై బయటున్న అనంతబాబు
తల్లి మరణం నేపథ్యంలో అనంతబాబు ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు. ఇటీవల ఆయన తల్లి మరణించడంతో కోర్టు 3 రోజుల కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పొడిగించాలంటూ అనంతబాబు హైకోర్టును ఆశ్రయించగా సెప్టెంబరు 5 వరకు బెయిల్ పొడిగిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, బెయిల్ షరతులపై కిందికోర్టు ఇచ్చిన ఉత్తర్వులను యథాతథంగా పాటించాలని అనంతబాబుకు స్పష్టం చేసింది.
త్వరలోనే హైకోర్టు పొడిగించిన బెయిల్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలోనే, మరోసారి బెయిల్ కు దరఖాస్తు చేసుకోగా, రాజమండ్రి కోర్టులో నిరాశ తప్పలేదు.