Telangana: తెలంగాణ కానిస్టేబుల్ పరీక్ష కీ విడుదల.. 31న ఉదయం నుంచి అభ్యంతరాల స్వీకరణ

  • ఈ నెల 28న తెలంగాణ వ్యాప్తంగా జరిగిన పరీక్ష.. రెండు రోజుల తర్వాత కీ విడుదల
  • అభ్యంతరాలు, సూచనలు ఉంటే తెలపాలన్న పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు
  • తగిన ఆధారాలను వెబ్ సైట్లో అప్ లోడ్ చేయాలని సూచన
Telangana constable exam primary key released

తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రాథమిక పరీక్ష కీని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు విడుదల చేసింది. దీనిని బోర్డు వెబ్ సైట్  https://www.tslprb.in/ లో అందుబాటులో ఉంచినట్టు ప్రకటించింది. అభ్యర్థులు పరీక్ష ప్రశ్నపత్రంతో కీ ని సరిపోల్చుకోవాలని సూచించింది. పరీక్ష కీపై ఏవైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే.. ఈ నెల 31వ తేదీన ఉదయం 8 గంటల నుంచి వచ్చే నెల 2న సాయంత్రం 5 గంటలలోపు తెలపవచ్చని వివరించింది. కీ లోగానీ, ప్రశ్నపత్రంలోగానీ ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్టయితే.. వాటికి సంబంధించిన ఆధారాలను వెబ్ సైట్లో అప్ లోడ్ చేయాలని కోరింది.

పరీక్ష జరిగిన రెండు రోజులకు..
తెలంగాణలో సివిల్ పోలీస్‌ విభాగంలో 15,644 కానిస్టేబుల్ పోస్టులు, ఎక్సైజ్ శాఖలో 614, రవాణా శాఖలో 63 కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం ఆగస్టు 28న ప్రాథమిక రాత పరీక్ష జరిగింది. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు పరీక్ష కీని విడుదల చేసింది. 

More Telugu News