Sathyadev: తమన్నా సినిమా రిలీజ్ డేట్ వాయిదా!

  • విభిన్న కథాచిత్రంగా 'గుర్తుందా శీతాకాలం'
  • సత్యదేవ్ సరసన నాయికగా తమన్నా 
  • సంగీత దర్శకుడిగా కాలభైరవ 
  • సెప్టెంబర్ 23వ తేదీన సినిమా విడుదల  
Gurthunda Seetakalam movie update

తమన్నా ఆ మధ్య ఒప్పుకున్న సినిమాల్లో 'గుర్తుందా శీతాకాలం' ఒకటి. ఈ సినిమా విడుదలకి సిధ్ధమై చాలా కాలమే అయింది. అయితే ఎప్పటికప్పుడు పోటీ ఎక్కువగా ఉండటంతో, వాయిదాపడుతూ వచ్చింది. ఈ సినిమాలో ఆమె జోడీగా సత్యదేవ్ కనిపించనున్నాడు. హీరోగా ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండనుంది.
 
కథానాయకుడి జీవితంలో ఆయా దశల్లో .. ఆయా సందర్భంలో చోటుచేసుకునే ప్రేమకథలే ఈ సినిమా. ప్రధానమైన ప్రేమకథలో తమన్నా కనిపిస్తుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 9వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ సెప్టెంబర్ 23వ తేదీకి వాయిదా వేస్తూ తాజాగా ఒక పోస్టర్ ను వదిలారు.

భావన రవి - చింతపల్లి రామారావు నిర్మించిన ఈ సినిమాకి కాలభైరవ సంగీతాన్ని అందించాడు. నాగశేఖర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. 'గాడ్సే' ఫ్లాప్ తరువాత సత్యదేవ్ నుంచి, 'ఎఫ్ 3' హిట్ తరువాత తమన్నా నుంచి వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.

More Telugu News